BARNYARD MILLET -  ఊదలు

BARNYARD MILLET - ఊదలు

  • ఊదలు రుచికి తియ్యగా ఉంటాయి.
  • ఊదలతో తయారు చేసిన ఆహార సులభంగా జీర్ణమవుతుంది కనుక ఉత్తర భారతదేశంలో ఉపవాస దీక్షలో ఎక్కువగా ఉపయోగిస్తారు.
  • ఉత్తరఖాండ్, నేపాల్ లో ఊదలు  ఆహారాన్ని గర్భిణీలకు బాలింతలకు ఎక్కువగా ఇస్తారు ఎందుకంటే ఊదలలో ఇనుము శాతం ఎక్కువగా ఉండడం వల్ల రక్తహీనత తగ్గి బాలింతలకు పాలు బాగా పడతాయి అని నమ్ముతారు,
  • ఈ ఆహారం శరీర ఉష్ణోగ్రతలను సమస్థితిలో ఉంచుతుంది.
  • ఊదలు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి.
  • శరీరక శ్రమ లేకుండా ఎక్కువసేపు కూర్చొని పనిచేసే వారికి ఊదలు చాలా మంచి ఆహారం.
  • ఊదలో పీచు పదార్థం అధికంగా ఉండడం వలన మలబద్దకానికి, మధుమేహానికి మంచి ఆహారం.
  • జీర్ణాశయంలో ముఖ్యంగా చిన్న ప్రేవులలో ఏర్పడే పుండ్లు పెద్ద ప్రేవులకి వచ్చే క్యాన్సర్ బారిన పడకుండా ప్రేవులలో ఊదలు ఆహారం కాపాడుతుంది.
.